ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
NEWS Oct 05,2026 10:24 pm
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ప్రజల నుంచి వచ్చిన 130 వినతులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన వినతుల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయవద్దని వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.