టీచర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
NEWS Oct 05,2026 01:13 pm
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనంద్‌రావు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నూతన బోధనా పద్ధతులను అవలంబిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.