కంటి సమస్యలతో బాధపడుతున్న గ్రామస్థులకు వైద్య సేవలు అందించేందుకు ప్రతిమ ఆసుపత్రి ఆధ్వర్యంలో గంభీర్పూర్ గ్రామంలో ప్రత్యేక కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి వచ్చిన వారిని ప్రత్యేక బస్సులో కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఐదుగురికి కంటి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. వారికి అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేసి, వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు ప్రతిమ ఆసుపత్రి చేస్తున్న కృషిని గ్రామస్థులు అభినందించారు.