రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
NEWS Sep 28,2026 08:02 pm
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.సీఎస్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుండి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ సంజయ్ జాజు కలెక్టర్లతో విద్యావ్యవస్థపై చర్చించారు.