అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
NEWS Sep 27,2026 10:46 am
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో 8 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందవరం మండలంలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.