లంచం తీసుకుంటూ చిక్కిన సిడిపిఓ పద్మ
NEWS Sep 26,2026 02:43 pm
మెట్‌పల్లి పట్టణంలో రూ.63 వేల లంచం తీసుకుంటున్న సీడీపీఓ పద్మను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు సంబంధించిన రూ.63 వేల లంచం ఇవ్వాలని సీడీపీఓ డిమాండ్ చేసినట్లు అంగన్‌వాడీ టీచర్లు కరీంనగర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఏసీబీ ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ గొర్రె మధు ఆధ్వర్యంలో అధికారులు వల పన్ని, లంచం తీసుకుంటుండగా పద్మను పట్టుకున్నారు. ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.