కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతుందని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.