నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం
NEWS Sep 25,2026 02:58 pm
అనకాపల్లి జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన కార్యాలయం అందుబాటులోకి రావడంతో జిల్లా పరిషత్ పరిపాలనా కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని తాతయ్యబాబు పేర్కొన్నారు.