తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. గడువులోగా చేయూత కొత్త పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించాలని, అలాగే ఈ ప్రక్రియలో దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.