అడవిలో పూచిన మోదుగు పువ్వు!
NEWS Sep 24,2026 09:27 pm
ఆదిలాబాద్: ఇంద్రవెల్లి (M) హీరాపూర్‌కి చెందిన ప్రీతి ముండే జాతీయ స్థాయి అందాల పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి ‘మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. యోగా, క్రీడలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణలోనూ చురుగ్గా పాల్గొంటున్న ప్రీతి.. ఫిలిప్పీన్స్‌లో జరగనున్న అంతర్జాతీయ ‘మిస్ ఎర్త్’ వేదికపై భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతోంది. ఈ పోటీల్లో ప్రీతి ప్రదర్శన, స్నేహపూర్వక వ్యక్తిత్వానికి గుర్తింపుగా ‘మిస్ కంజీనియాలిటీ 2026’ ఉప కిరీటాన్ని కూడా అందుకుంది.