పట్టభద్రులు ఓటుహక్కు నమోదు చేసుకోవాలి
NEWS Sep 24,2026 09:32 pm
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పట్టభద్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.