చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 3 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వచ్చిన నేపథ్యంలో ఆయనకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. ట్రంప్‌తో జరగనున్న 2వ శిఖరాగ్ర సమావేశం కోసం జిన్‌పింగ్, చైనా ప్రథమ మహిళ పెంగ్ లియువాన్‌లు అమెరికాలోని మేరీల్యాండ్‌లో జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ల్యాండ్ అయ్యారు. షీ, పెంగ్‌లు విమానం నుండి దిగుతుండగా, ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు నిచ్చెన కింద వేచి ఉండి స్వాగతం పలికారు.