హనుమకొండ జిల్లా కాజీపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో తాగునీటి కోసం మాజీ కార్పొరేటర్ కుమారస్వామి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. భోజనం చేసేందుకు సరైన వసతులు లేక ప్రస్తుతం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఏటా వర్ష కాలంలో పాఠశాలలోకి వరద నీరు చేరుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.