భారీగా తగ్గిన బంగారం ధరలు
NEWS Sep 24,2026 02:06 pm
బుధవారం పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,680గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.1520 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,39,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.1400 మేర తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. వెండి ధర కిలోకు రూ.5 వేల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది.