సౌదీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు
NEWS Sep 23,2026 06:29 pm
ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన తెలంగాణకు చెందిన యువకులు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, భారతీయ సంప్రదాయాలను చాటిచెప్పేలా వినాయక వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుడికి వీడ్కోలు పలికారు. కోడూరి రోహిత్ రాజ్, శివ ప్రసాద్, రమేష్, అరవింద్, హరీష్, శ్రీకాంత్, నరేష్, శేఖర్, వినయ్, గణేష్, మారుతి, మహేష్, దశరథం, గంగాధర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.