పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
NEWS Sep 22,2026 08:56 pm
విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్ పర్తి మండలం జయగిరి శివారులో ఉన్న ఎంజెపి గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ రవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట గదిని సందర్శించి కూరగాయలు ఇతర నిత్యవసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.