తెలంగాణలో మాజీ నక్సలైట్ల కొత్త పార్టీ
NEWS Sep 21,2026 10:15 am
తెలంగాణలో మాజీ మావోయిస్టులు, మాజీ నక్సలైట్ల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ‘జన తెలంగాణ పార్టీ’ పేరిట కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది. మాజీ నక్సలైట్లతో పాటు అభ్యుదయ, ప్రజాస్వామికవాదులు, పౌరహక్కుల ఉద్యమ నాయకులు కూడా ఇందులో భాగస్వాములు కానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని అన్ని స్థాయిల ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.