ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
NEWS Sep 20,2026 09:45 pm
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కొత్తగూడకు చెందిన షేక్ ఆసిఫ్ అనే వ్యక్తికి వాట్సాప్ లో ఆర్టిఏ ఈ చలాన్ పేరుతో ఓ లింకు వచ్చింది. దీంతో ఆ లింకును ఓపెన్ చేయడంతో అతని ఖాతా నుంచి రూ.85వేల నగదు కట్ అయ్యాయి. ఇది గమనించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆ వ్యక్తి ఖాతాను హోల్డ్ లో ఉంచి సైబర్ కోణంలో దర్యాప్తు చేపట్టారు.