గల్ఫ్ ఏజెంట్ ఇంటి ముందు ధర్నా
NEWS Sep 19,2026 03:54 pm
కోరుట్ల: సర్పరాజుపూర్‌లో గల్ఫ్ ఏజెంట్ ఇంటి ఎదుట బాధితులు బైఠాయించి తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. సిమల్ల మధు ద్వారా గల్ఫ్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగాల కోసం వెళ్లిన తమకు, అక్కడ పనిచేసిన అనంతరం రావాల్సిన జీతాలు, ఇతర చెల్లింపులు అందలేదని బాధితులు ఆరోపించారు. బకాయిల కోసం సంబంధిత వ్యక్తులను పలుమార్లు సంప్రదించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఇప్పించి, తమ కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.