సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి
NEWS Sep 19,2026 07:39 pm
ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రపంచ దినోత్సవ కార్యక్రమాలపై సమీక్షించారు. చారిత్రక ఆలయాల వద్ద పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.