అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షా
NEWS Sep 19,2026 07:37 pm
హనుమకొండ: ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్ ) ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులలో పురోగతిలో ఉన్నవాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. మిగతా అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజుల్లో ఎంపీల్యాడ్స్ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు.