నీట్‌లో జాతీయ స్థాయిలో సత్తా
అబూబకర్ సిద్ధిఖ్‌లకు సన్మానం
NEWS Sep 19,2026 03:09 pm
మెట్‌పల్లి: ప్రముఖ న్యాయవాది, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్ కొడుకు మొహమ్మద్ అబూబకర్ సిద్ధిఖ్ నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు సాధించాడు. ఈ సందర్భంగా బెజ్జారపు శ్రీనివాస్ ఆయనను శాలువాతో సత్కరించారు. అబూబకర్ సిద్ధిఖ్ వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.