కాలువలు శుభ్రం చేసుకుంటున్న స్థానికులు
NEWS Sep 19,2026 02:55 pm
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని స్టేట్‌బ్యాంక్ కాలనీ, ఎంజీఆర్ జిమ్ రోడ్డు పక్కన కాలువలు అధ్వానంగా ఉన్నాయి. కప్పులు లేక దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయాల్సిన కాలువలను ఎవరి ఇంటి ముందు వారే శుభ్రం చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.