హరిబాబును చంపాను.. వైష్ణవి సోదరుడు
NEWS Sep 17,2026 10:52 pm
నిజామాబాద్‌లో హరిబాబు(26)ను నరికి చంపింది తానేనని వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. పీఎస్‌లో లొంగిపోతానని తెలిపాడు. యూట్యూబర్ వైష్ణవి హత్యకేసులో నిందితుడు, ఆమె భర్త చిత్తరి హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. గత కొన్ని రోజులుగా హరిబాబు తన తల్లితో కలిసి నిజామాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ కారులో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆయన తలపై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేయడంతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.