వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
NEWS Sep 17,2026 06:53 pm
నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని యువకుడు కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గత మార్చిలో అదనపు కట్నం వేధింపుల నేపథ్యంలో గర్భవతి అయిన వైష్ణవిని హరిబాబు హత్య చేసిన కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. బెయిల్‌పై బయట ఉన్న హరిబాబు హత్యకు గురికావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి హత్య కేసుతో తాజా హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.