ప్రీతిరెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీలు చించివేత
NEWS Sep 17,2026 06:09 pm
మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీలు రాజకీయ వివాదానికి దారితీశాయి. సూరారం, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్, స్థానిక నేతల ఫొటోలు లేకపోవడంపై BRS కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను చించివేసి, మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రీతిరెడ్డి స్పందిస్తూ.. తన ఫ్లెక్సీలను చింపగలరేమో కానీ, తన మనోబలాన్ని చింపలేరని అన్నారు.