హైదరాబాద్ గుజరాత్ నువ్వా నేనా
NEWS Apr 06,2025 08:12 pm
ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కీలక లీగ్ మ్యాచ్ ప్రారంభమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోరు కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగింది ఎస్ ఆర్ హెచ్. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను ఔట్ చేశాడు. ప్రసిద్ద్ కృష్ణ చేతికి చిక్కాడు ఇషాన్ కిషన్. ఇక తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చిన హైదరాబాద్ ఆ తర్వాతి మ్యాచ్ లలో ఆశించిన మేర ఆడలేక పోయింది. టోర్నీలో హాట్ ఫేవరేట్ గా ఉన్న ఈ జట్టు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.