USA ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన
NEWS Apr 06,2025 08:35 am
దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అమెరికా వ్యాప్తంగా అమెరికన్లు నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ గెలిచాక ఇదే అతి పెద్ద కార్యక్రమం. ట్రంప్, మస్క్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో హోరెత్తించారు. ట్రంప్ నిర్ణయాల కారణంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య యుద్దాలు పెరుగుతాయని వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.