రేవంత్ కామెంట్స్ కేటీఆర్ సెటైర్
NEWS Jan 17,2025 06:23 am
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణకు ఏం ఒరగ బెట్టారని ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉంది సీఎం వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల అమలుకు అతీ గతి లేకుండా పోయిందన్నారు. ఢిల్లీలో కొత్త నాటకానికి తెర లేపాడంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. సీఎంకు అంత సీన్ లేదన్నారు.