ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ముందు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. తనతో పాటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన అడ్వకేట్స్ ను అనుమతించక పోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయవాదులను అనుమతించక పోతే తాను విచారణకు రానంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పారు కేటీఆర్. ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ వాతావరణం నెలకొంది.