శ్రీశ్రీశ్రీ పెరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి 75వ తిరు నక్షత్రం సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయంలో తిరు నక్షత్ర మర్యాద జరిగింది. పెద్ద మర్యాదలో భాగంగా పెద్ద జీయర్ స్వామికి ఇస్తికఫాల్ స్వాగతం పలుకగా మేళ తాళాల మధ్య శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామితో కలిసి ఆలయం వద్దకు విచ్చేశారు.