రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్య పోటీలలో మెట్‌పల్లి చిన్నారులు
NEWS Dec 15,2024 11:50 am
రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్య పోటీలలో మెట్‌పల్లి చిన్నారులు అంకతి విశ్వంభర, శ్రీ గాయత్రి హర్షాలి, అక్షిత, రిత్విక, వైజ్ఞానిక, నిత్యశ్రీ, శ్రీకృతి, సుధీక్ష ప్రతిభ కనపరిచారు. హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో శివాని ఆర్ట్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు నృత్య పద్య కవిత పోటీలు నిర్వహించారు. ఇందులో మీనాక్షి నృత్య కళా నిలయం గురువు శ్రీవాణి ఆధ్వర్యంలో మెట్‌పల్లి నుంచి వెళ్లారు.