మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబందించిన పలు విషయాలను ఎప్పటికప్పుడు లీక్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తూ మెగా అభిమానులను ఖుషీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిరు లీక్స్ ద్వారా పలు సీక్రెట్ లను మెగా అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా మరో ‘చిరు లీక్ ‘ కు సిద్దమయ్యాడు.

ఆ విషయం నేనే లీక్ చేస్తానంటున్న చిరంజీవి. ఇంతకీ చిరంజీవి లీక్ చేస్తానంటున్న విషయం ఏంటో తెలుసా ….. తన 158 వ సినిమా టైటిల్ ని నేనే లీక్ చేయబోతున్నాను అంటూ హింట్ ఇచ్చేసాడు. కొల్లి బాబీ దర్శకత్వంలో తాజాగా చిరంజీవి 158 వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కాగా ఆ సినిమా టైటిల్ ని లీక్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్ సందడి చేయగా దర్శకుడు బాబీ ఇప్పుడే వద్దు సార్ అంటూ వచ్చిన వీడియో మెగా అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

అంటే త్వరలోనే చిరు లీక్స్ కావడం ఖాయం …. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు లోడ్ అవ్వడం ఖాయమనిపిస్తోంది.

tags : chiranjeevi , megastar chiranjeevi , mega leaks , chiru leaks , mega 158 , kolli babby ,