▪️ తెలుగులో అనువదించిన గాయక్వాడ్ తులసిదాస్
▪️ ప్ర‌చురించిన తెలంగాణ సాహిత్య అకాడెమీ
▪️ లహుజీ సాళ్వె సేవ‌ల‌ను కొనియాడిన మంత్రి జూప‌ల్లి

హైద‌రాబాద్ (Breaking Now Network): తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురించిన క్రాంతిపిత గురు లహుజీ సాళ్వె జీవిత చరిత్ర పుస్తకాన్ని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

చంద్రకాంత్ వాన్ ఖేడ్ రాసిన మరాఠీ గ్రంథాన్ని గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ తెలుగులో అనువదించారు. తెలంగాణ సాహిత్య అకాడెమీ ఈ పుస్త‌కాన్నిప్రచురించింది.

ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. క్రాంతిగురు లహుజీ సాళ్వె వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని దేశం, సమాజ సేవకు అంకితం చేసి వేలాదిమంది స్వాతంత్య్ర‌ పోరాట యోధులను తీర్చిదిద్దిన మహనీయుడని కొనియాడారు. అలాగే లహుజీ సాళ్వె, మహాత్మా జ్యోతిరావు పూలేకు గురువుగా నిలిచి, ఆ కాలంలో విద్యా, సామాజిక సంస్కరణ కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని మంత్రి గుర్తుచేశారు. వారి చరిత్ర తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడెమీ ద్వారా ఈ గ్రంథాన్ని ప్రచురించిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం ద్వారా లహుజీ సాళ్వె జీవితం, సేవలను తెలుసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడెమీ కార్యదర్శి డా. నామోజు బాలచారి, సీనియర్ జర్నలిస్ట్ జంగిటి వెంకటేష్, మంత్రి పిఎస్‌యు నాగార్జున, అనువాద ర‌చ‌యిత‌ గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్, సాహితీవేత్త సోమశిల తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.