హైదరాబాద్‌: తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (TMBMWA) 5వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 27న నిర్వహించనున్న అవార్డు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, అవార్డులను రవీంద్రభారతిలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాస‌న మండ‌లి డిఫ్యూటీ చైర్మ‌న్ బండా ప్రకాష్ అవార్డులను లాంచ్ చేశారు. కార్యక్రమంలో గోప ప్రెసిడెంట్ బండి సాయన్న గౌడ్, సామాజిక మహిళా నాయకురాలు సామ స్వరూప గౌడ్, మామిండ్ల మాధవి, దేవిక తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏడు ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. అందులో శ్రీ మహా నంది అవార్డు, ఐకాన్ అవార్డు, మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు, ఉత్తమ సేవ రత్న అవార్డు, శ్రమ శక్తి, గౌత‌మ బుద్ద సేవర‌త్న అవార్డు, న‌ట‌రాజ వంటి అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న నిపుణులకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఉత్స‌వ క‌మిటీ చైర్మ‌న్ ప‌న్యాల‌ మ‌మ‌తగౌడ్ తెలిపారు.

సంస్థ ఐదేళ్ల ప్రయాణంలో మ్యారేజ్ బ్యూరో రంగంలో సేవలు అందిస్తున్న వ్యక్తులను ప్రోత్సహించడం, సామాజిక సేవా కార్యక్రమాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యమని బుర్ర శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు భాగ్య‌ల‌క్ష్మి గంగ‌పుత్ర‌, అసోసియేష‌న్ ఇంచార్జ్, ప్ర‌త్యేక అడ్వైజ‌ర్ ఏశాల ఈశ్వ‌ర్ నేత‌, మహిళా ఇంచార్జీ ముక్కెర నిర్మల,  క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ అంత‌టి మ‌హేశ్వ‌రీ గౌడ్, రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ధుసుధ‌న్ గౌడ్,  రాష్ట్ర డిసిప్లిన‌రీ క‌మిటీ చైర్మ‌న్ శ్యామ్ రావు ముదిరాజ్,  స్టేట్ హ‌న‌రీ ప్రెసిడెంట్ అయిల్ల ర‌వింద‌ర్ గౌడ్, బెజ్జంకి సుజాత మాదిగ‌, ట్రేజ‌ర‌ర్ కుకునూరి వెంక‌టేశ్ గౌడ్, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్రెసిడెంట్ మ‌లుగూరి శేఖ‌ర్ గౌడ్, రిక‌వ‌రీ క‌మిటీ చైర్మ‌న్ గ‌డ్డం స‌రితా గౌడ్, రిక‌వ‌రీ కో-ఆర్డినేట‌ర్స్ ప్ర‌హ్ల‌ద్ గంగ‌పుత్ర‌, అనిత భోగి మున్నురుకాపు, చీఫ్ అడ్వైజ‌ర్ జ‌గ‌దీష్ ప‌టేల్, జాన‌కి బాయ్ మాదిగ‌, హాన‌రీ అడ్వైజ‌ర్ శ్యామ‌లా న‌రేంద‌ర్ మాదిగ‌, అడ్వైజ‌ర్స్ రాములు గంగ‌పుత్ర‌, లిష్ట‌య్య‌ప‌టేల్, శ్రీనివాస్ చౌద‌రి, తిప్ప‌ర్తి ధ‌న‌ల‌క్ష్మి చారి, గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ర‌మేష్ చారి, గంట వినోద రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.