జెద్దా: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో సాటా (Saudi Arabia Telugu Association) జెద్దా చాప్టర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ కష్టపడి పనిచేస్తున్న భారతీయ కార్మికులకు ఈ కార్యక్రమం ద్వారా ఇఫ్తార్ భోజనాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సాటా జట్టు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. సమాజానికి సేవ చేయాలనే భావనతో, దాతృత్వంతో ముందుకు వచ్చిన సభ్యుల సేవాభావం ఈ కార్యక్రమంలో ప్రతిఫలించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అమ్జాద్ పాషా అహమదాలి, సైద్ ఇబ్రాహీం, అబ్దుల్ మహమ్మద్, మహ్మధూసెన్ జమాల్‌భాయి సుతార్, రఘవేంద్ర రావు నందగిరి, మొయ్జుద్దిన్, డా. నాగ్రాజ్ (ఖమ్మం), సమీ వాహీడ్ (హైదరాబాద్), ఫయాజ్ (కరీంనగర్), శ్రీనివాస్ (కరీంనగర్), అహ్మద్ (రాజమండ్రి), హిదయత్, సయ్యద్దుద్దీన్, మొహ్ద్ అరీఫ్ (హైదరాబాద్), డా. మిర్జా కుద్రత్ బైగ్ విశేషంగా సహకరించారు.

ఈ సందర్భంగా సాటా జెద్దా చాప్టర్ అధ్యక్షుడు అమ్జాద్ (వరంగల్) మాట్లాడుతూ, “వీరి అంకితభావం వల్ల కుటుంబం నుండి దూరంగా ఉండి కష్టపడి పనిచేస్తున్న ఎంతోమంది సోదరులకు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ అందించగలిగాం” అని తెలిపారు.

సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. “మీ దాతృత్వం సమృద్ధిగా ఫలించాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో మనం కలిసి పని చేస్తూ సమాజానికి సేవ చేయాలని ఆశిస్తున్నాం” అని అన్నారు.