▪️ 108 మంది మాతృమూర్తుల‌ను గౌర‌వించుకునే వేడుక‌
▪️ శ్రీ సరస్వతి దేవి అనురాగధార ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
▪️ డా. లక్ష్మి అన్నదాత అమ్మల కోసం వినూత్న కార్యక్రమం

హైదరాబాద్: తల్లి నిరంతర ప్రేమ, అసమాన త్యాగం, బిడ్డల భవిష్యత్తు కోసం ఆమె చేసే మార్గదర్శకత్వాన్ని గౌరవించుకోవాలనే సత్సంకల్పంతో శ్రీ సరస్వతి దేవి అనురాగధార ఫౌండేషన్ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మే 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు “మాతృ సన్మాన్ మహోత్సవం” పేరుతో ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, స‌నాత‌న్ ఆయుర్వేద ఫౌండ‌ర్, హెల్త్ ఎసెన్షియల్స్ డా. లక్ష్మి అన్నదాత వెల్లడించారు.

108 మంది తల్లులకు విశిష్ట గౌరవం
తమ మాతృమూర్తి సరస్వతి దేవి స్మార‌కార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డా. లక్ష్మి అన్నదాత తెలిపారు. సమాజంలోని వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తుల వెనుక శక్తిగా నిలిచిన 108 మంది తల్లులను ఎంపిక చేసి, ఈ వేదికపై వారిని ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు తెలిపారు.

తల్లి పాత్ర అజరామరం
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ప్రతి వ్యక్తి జీవిత నిర్మాణంలో తల్లి పాత్ర వెలకట్టలేనిది. ఆమె అందించే ప్రేరణ, త్యాగాలే సమాజానికి బలమైన పునాదులు. మాతృప్రేమలోని గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు, తల్లుల త్యాగాలను నేటి తరానికి ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

వేడుక విశేషాలు
ఈ మహోత్సవంలో పలువురు ప్రముఖులు, సామాజిక విశ్లేషకులు, గౌరవ అతిథులు పాల్గొని ప్రసంగించనున్నారు. సన్మాన కార్యక్రమంతో పాటు తల్లి గొప్పతనాన్ని చాటిచెప్పే స్ఫూర్తిదాయక ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

అందరికీ ఆహ్వానం
అమ్మపై ఉన్న మమకారంతో నిర్వహిస్తున్న ఈ అర్థవంతమైన కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు, ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని డా. లక్ష్మి అన్నదాత విజ్ఞప్తి చేశారు.
మ‌న త‌ల్లుల‌ను స‌త్క‌రించుకోవ‌డానికి ఈ స‌ద‌వ‌కాశాన్ని గౌర‌వించుకుందాం. వివ‌రాలు ఇక్క‌డ న‌మోదు చేయండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSceSjjUIIMMhn-2YE9g6jOJYH_6ZSZ4X3eLqhE5DwFprdfYAg/viewform
న‌మోదు చేసుకున్నాక వారిని నిర్వ‌హ‌కులు ఫోన్ ద్వారా సంప్ర‌దిస్తారు.