మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం ‘పెద్ది ‘ జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. వేసవిలోనే రావలసిన ఈ సినిమా పలు కారణాల చేత వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్ 4 న విడుదల అవుతోంది. ఈ ఏడాది టాలీవుడ్ లో సరైన సినిమాలు లేక థియేటర్ లు అన్నీ వెలవెలబోయాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు చిత్రం బాక్సాఫీస్ ని కుమ్మేసింది. భారీ వసూళ్లతో టాలీవుడ్ కు సరికొత్త ఊపుని ఉత్సాహాన్ని అందించింది. అయితే ఆ స్థాయిలో మరో హిట్ ఈ ఏడాది లభించలేదు. దాంతో థియేటర్ లన్నీ బోసిపోయాయి.

ఇక సమ్మర్ కూడా అయిపోవచ్చింది. కానీ సరైన పెద్ద సినిమా ఏది లేకపోవడంతో బయ్యర్లు , ఎగ్జిబిటర్లు తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. అలాంటి సమయంలో రాంచరణ్ ‘పెద్ది’ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి రికార్డుల మోత మోగిస్తుందనే నమ్మకంతో ఉంది తెలుగు చలన చిత్ర పరిశ్రమ.

రాంచరణ్ విభిన్న గెటప్ లపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే బాక్సాఫీస్ ని పెద్ది ఊచకోత కోయడం ఖాయం. ఈ ఏడాదిలో మన శంకర వరప్రసాద్ చిత్రం తర్వాత అంతటి భారీ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమా పెద్ది కావడంతో అందరూ ఈ పెద్ది పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను పెద్ది భర్తీ చేస్తుందా ? లేదా ? అన్నది జూన్ 4 న తేలనుంది.

ramcharan , charan , peddi , chiranjeevi , tollywood , tollywood films