హైదరాబాద్: కర్మన్‌ఘాట్‌లోని శుభం ప్యాలెస్‌లో GBN ELITE SOCIETY తొలి వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జ‌రిగాయి. గౌడ సమాజ ఐక్యత, ఆర్థిక అభివృద్ధి, పరస్పర సహకారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాటైన ఈ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, పల్లె కళ్యాణి, గోపా అధ్యక్షుడు బండి సాయన్న, సినీ నటుడు సంజయ్ గౌడ్, ముద్దగౌని రామ్ మోహన్ గౌడ్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌడ సమాజం ఆర్థికంగా ఎదగడానికి, వ్యాపార అవకాశాలు పెంపొందించడానికి GBN ELITE SOCIETY వంటి వేదికలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సేవా భావం, పరస్పర సహకారం పెరిగితేనే ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, యువతకు ఉపాధి మరియు వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా సంస్థ పనిచేయాలని సూచించారు.

సంస్థ సభ్యులు గత ఏడాది కాలంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలను అభినందించిన అతిథులు.. భవిష్యత్తులో GBN ELITE SOCIETY మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. నిర్వాహకులకు, సభ్యులకు తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. “మనవారు ఎదగాలి.. మన వ్యాపారాలు అభివృద్ధి చెందాలి.. గౌడ సమాజం ఆర్థికంగా బలపడాలి” అనే లక్ష్యంతోనే GBN ELITE SOCIETY ఏర్పాటైందని తెలిపారు. పరస్పర సహకారం, నమ్మకం, బిజినెస్ సపోర్ట్ అనే మూడు ప్రధాన సూత్రాలపై సంస్థ ముందుకు సాగుతోందన్నారు.

“ఈ ఒక్క సంవత్సరం ప్రయాణంలో ప్రతి సభ్యుడు ఎంతో dedication‌తో పనిచేశారు. ప్రతి member కృషి వల్లే ఈ రోజు మన first anniversary‌ను ఇంత ఘనంగా నిర్వహించగలిగాం” అని GBN ELITE SOCIETY కోర్ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు GBN ELITE SOCIETY యొక్క “సావనీర్ 2026” మేగజైన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేకంగా ప్రశంసలు వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆహూతులను అలరించాయి. సభ్యులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.