అందాల భామ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తన అందాలతో అలరించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రతీసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈ అందాల భామ. తాజాగా 79 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతూ ఉండటంతో ఆ వేడుకల్లో పాల్గొని రెడ్ కార్పెట్ పై జిగేల్ అందాలతో మెరిసింది అందాల ఐశ్వరం.
52 ఏళ్ల ఈ భామ ఇప్పటికీ వన్నె తగ్గని అందాలతో కుర్రకారు గుండెల్లో మంటలు పెడుతూనే ఉంది. యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడి మరీ అందాల విందు చేస్తోంది. తాజాగా నీలి రంగు దుస్తుల్లో ఐశ్వర్య రాయ్ అందాలు మరింత అందంగా కనువిందు చేసాయి .
