www.breakingnow.app | Thu, 26 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

కరెంట్ షాక్ తో రైతు మృతి

Share:
128 Views
 కరెంట్ షాక్ తో రైతు మృతి

ఇబ్రహీంపట్నం: విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన విషాద ఘటన ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగిలి ఆశన్న (70) తన పొలంలో మోటార్ స్టార్ట్ కాకపోవడంతో పరిశీలించేందుకు వెళ్లాడు. అదే సమయంలో పొలంలో ఉన్న కోతులను తరిమే క్రమంలో ప్రమాదవశాత్తు తెగిపడి ఉన్న విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.