www.breakingnow.app | Thu, 26 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

మెట్‌పల్లిలో 30న విద్యా సభ

Share:
128 Views
మెట్‌పల్లిలో 30న విద్యా సభ

‘నేటి సమాజంలో విద్య ఆవశ్యకత’ అనే అంశంపై ఈ నెల 30న మెట్‌పల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బిస్మిల్లా మసీదు, మదర్సా అరబియా తజ్వీదుల్ ఖురాన్‌ ప్రాంగణంలో జరగనున్న ఈ సభకు సంబంధించి నిర్వాహకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఇస్లామిక్‌ పండితులు హజ్రత్‌ మౌలానా పి.ఎం. ముజమ్మిల్‌ సాహెబ్‌ వలాజాహీ రషాదీ నక్శ్‌బందీ ముఖ్య వక్తగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో అఖ్తర్‌ జానీ, అడ్వకేట్‌ అబ్దుల్‌ హఫీజ్‌, జావిద్‌తో పాటు సభా నిర్వాహకులు పాల్గొన్నారు. విద్య ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే సభ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.