www.breakingnow.app | Sun, 22 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

సర్పంచ్‌లకు బ్యాంకింగ్‌పై అవగాహన

Share:
128 Views
సర్పంచ్‌లకు బ్యాంకింగ్‌పై అవగాహన

జగిత్యాల: జిల్లా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26న సర్పంచ్‌లకు ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన శిబిరం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఐడీఓసీలో కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అధ్యక్షతన కార్యక్రమం జరగనుంది. ఆర్‌బీఐ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ యశ్వంత్‌ సాయి, నాబార్డ్‌ జిల్లా అభివృద్ధి మేనేజర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌, సైబర్‌ మోసాల నివారణ, బ్యాంకింగ్‌ ఫిర్యాదుల పరిష్కారం, గ్రామీణ జీవనోపాధి పథకాలు, ఆర్థిక సమ్మేళనంపై అవగాహన కల్పించనున్నారు. సర్పంచ్‌లందరూ శిబిరానికి హాజరుకావాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామ్‌కుమార్‌ కోరారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.