హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే
బీసీ రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు
NEWS Oct 15,2026 09:03 pm
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి గతంలో ఉన్న కులం ఆధారంగా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హిందూ బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు ఇస్లాంలోకి మారినప్పటికీ, పూర్వపు కులం ఆధారంగా రిజర్వేషన్లు కొనసాగుతాయని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మద్రాస్ హైకోర్టు గతంలో కొట్టివేసింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించడంతో, మత మార్పిడి అనంతరం పూర్వపు కులం ఆధారంగా రిజర్వేషన్ పొందే అంశంపై స్పష్టత ఏర్పడింది.