20 ఏళ్ల తర్వాత ఓసీ జనరల్ రిజర్వేషన్!
NEWS Oct 14,2026 09:45 pm
గిద్దలూరు: సుమారు 20 ఏళ్ల తర్వాత గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఓసీ జనరల్ కేటగిరీకి కేటాయించడంతో రాజకీయంగా ఆసక్తి పెరిగింది. 2006 తర్వాత మళ్లీ ఈ రిజర్వేషన్ రావడంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీ కూటమి నుంచి ఎనిమిది మంది, వైసీపీ నుంచి ముగ్గురు నేతలు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానాల నిర్ణయంపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొనగా, టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై పట్టణంలో రాజకీయ చర్చ జోరందుకుంది.