తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణను బలోపేతం చేసే దిశగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 13 మంది పోటు వర్కర్ సీనియర్లకు పోటు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాలక మండలి సమావేశంలో తీర్మానించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ పదోన్నతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న చైర్మన్కు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.