దుబాయ్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్‌కు స్వాగతం
NEWS Oct 14,2026 09:27 pm
దుబాయ్: దుబాయ్‌లో తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్‌కు ఎన్నారై కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు శిష్యుడిగా పేరొందిన విపుల్ గౌడ్‌కు ఆల్ రిసా గ్రూప్ ఛైర్మన్, దుబాయ్ ఎన్నారై సెల్ కాంగ్రెస్ కన్వీనర్ పల్లె బాలరాజ్ గౌడ్ పూల బొకే అందించి స్వాగతం తెలిపారు. బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.