వాట్సాప్లో NO అని రిప్లై ఇస్తే..
NEWS Oct 14,2026 10:29 am
వాట్సాప్ సందేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు నకిలీ మెసెజ్లు పంపి, వాటికి YES, NO అని రిప్లై ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఇలాంటి మెసెజ్లకు స్పందించకుండా, బ్యాంకు అధికారిక APPలో లావాదేవీలను పరిశీలించాలని సూచించారు. సైబర్ మోసంలో డబ్బు పోగొట్టుకుంటే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.