ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
NEWS Oct 11,2026 10:40 pm
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు, వినతిపత్రాలు సమర్పించే వారు ఆధార్ కార్డు ప్రతితోపాటు ఫోన్ నంబర్‌ను జతచేయాలని కోరారు.