బాలికల భద్రత.. సమాజం బాధ్యత
NEWS Oct 11,2026 06:09 pm
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ఎస్వి మెడికల్ కళాశాల వరకు భారీ ర్యాలీ, అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. వి. బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ., బాలికల పట్ల విపక్ష చూపకుండా అన్ని రంగాలలో సమానంగా అవకాశాలు కల్పించాలని కోరారు. బాల్య వివాహాలను అరికట్టి లింగ సమానత్వం పాటించాలని సూచించారు